త్రివేణి
సంగమం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అలహాబాద్ వారణాసికి 135 కిలో మీటర్, దూరంలో ఈ త్రివేణి సంగమం ఉంది. ఇక్కడ గంగా, యమునలు మన కళ్ళముందే కలుస్తాయి. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహించి కలుస్తుంది. దీన్నే ప్రయాగ, త్రివేణి సంగమం అంటారు. సాక్షత్తూ శ్రీరామ చంద్రుడు ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు రామాయణంలో తెలియజేయబడింది. ఒకప్పుడు ప్రజాపతి బ్రహ్మ ఈ సంగమ స్థలంలో ఒక గొప్ప యాగం చేశాడు. అందువల్ల ఈ ప్రదేశానికి ప్రయాగ లేక ప్రయాగరాజు అని పేరు వచ్చింది. హిందూ సిద్ధాంతం ప్రకారం ఇది ప్రక్షిత యజ్ఞం. బ్రహ్మ దేవుడు భూమిమీద ఆ యజ్ఞానికి ఒక స్థలాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్థలం గంగా, యమున, సరస్వతి నదుల కలయిక ఉన్నచోటు. ఈ కలయికను సంగమం అంటారు. సంవత్సరం పొడుగునా ఈ సంగమం ప్రాంతంలో పవిత్రమైన
ఉత్సవాలు, కర్మకాండలు జరుగుతుంటాయి. బ్రహ్మ ప్రపంచాన్ని
సృష్టించిన తర్వాత మొట్టమొదట యాగాన్ని ప్రయాగలో
చేశాడని హిందువుల నమ్మకం. ఇక్కడ పుణ్య స్నానాలు తమ కొరకే కాక తల్లితండ్రుల కొరకు, భార్య,
బంధువుల కొరకు, గురువులు, సోదరుల కొరకు చేయవచ్చు. నది మధ్యలో స్నానమాచరించడానికి చిన్న
చిన్న పడవలు ఉంటాయి. ఆ పడవల లో సంగమ స్త్నాననికి
వెళ్లి అక్కడ స్నానం చేయవచ్చు. గంగ ,యమున నదులు
కలిసే చోట రెండు విధాల రంగు గల నీళ్లు ప్రవహిస్తుంటాయి. ఒకటి నల్లని నీళ్లు , రెండవది
ఎర్రని నీళ్లు. ఇక్కడ నది లోతు తక్కువ గాను, ప్రవాహ వేగం కూడా తక్కువ గాను ఉంటుంది.
ప్రళయ కాలంలో ఈ భూమి అంత సముద్ర జలం తో మునిగి పోయిన , ఈ ప్రయాగ మాత్రం మునిగి పోదు.
ప్రళయ కాలంలో శ్రీ మహా విష్ణువు వట పత్ర సాయి రూపంలో ఇక్కడ ప్రత్యక్షమై ఉంటాడు. సమస్త
దేవతలు ఈ తీర్ధాన్ని కాపాడుతూ ఉంటారు.
బ్రహ్మ ఈ ఉరికి ఉత్తరముగా ఉన్న ప్రతిష్ఠానం
లో ఉంటాడు. విష్ణువు వేణు మాధవ రూపంలో వెలసి ఉంటాడు. పరమశివుడు అక్షయ వట వృక్ష రూపం
దాల్చి ఉంటాడు. ప్రతి వారు ఈ ప్రయాగ లో కేశ ఖండనం చేయుంచుకోవాలని కురుక్షేత్రం లో తర్పణాలు
వదలాలని , గయ లో పిండ ప్రధానం చెయ్యాలని, చివరకు కాశీలో ప్రాణ త్యాగం చేయాలని పురాణం
చెపుతుంది. పడవల రేవుకి అనుకోని ఉన్న కోట క్రీస్తుశకం 1583 లో అక్బర్ కట్టించాడు. కోట
లోపల ఒక భూ గృహాలయం ఉంది. ఈ ఆలయం లో అనేక మంది దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ఈ భూ
గృహాలయం లోనికి వెళ్లే మెట్ల దగ్గరే రావి, వేప చెట్లు కలసి ఉన్నాయి. దీనిని అక్షయ వటం
అని అంటారు. ఈ చెట్టు కింద కూర్చొని గౌతమ బుద్ధుడు తమ శిష్యులకు ప్రవచనాలు చేసాడని
కొంత మంది అంటారు. దూరం లో అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాధవేశ్వరి దేవి ఆలయం ఉంది.
కోట బయటకు వచ్చి కొంచెం ముందుకు వెలితే , రోడ్డుకు ఎడమ వైపున ఒక ఆంజనేయని ఆలయం ఉంది.
ఇందులో శయనించి ఉన్న ఆంజనేయ విగ్రహం ఉంది. సుమారు 20 అడుగుల పొడుగు, 15 అడుగుల వెడల్పు
తో ఈ విగ్రహం పూర్తిగా సిందూరం తో అలంకరించబడి ఉంది. హనుమాన్ ఆలయం దాటగానే, రోడ్డుకు కుడి వైపున కంచి కామకోటి
పీఠం వారు నిర్మించిన ఆలయం ఉంది. దక్షణాది పద్దతిలో నిర్మించబడిన ఈ ఆలయం మూడు అంతస్థులలో
ఉన్నదీ. క్రింద భాగం లోని గర్భగుడిలో కంచి కామాక్షి , మధ్య అంతస్థులో తిరుపతి వేంకటేశ్వరుడు,
మూడవ అంతస్థులో సహస్ర లింగా కృతి శివలింగం ఉన్నాయి. అలహాబాద్ చూడవలసిన ప్రదేశాలు మూడు
ఉన్నాయి. ఆనంద భవన్ , భరద్వాజ ఆశ్రమం , మ్యూజియం ఈ మూడు కూడా దాదాపు ఒకేచోట ఉన్నాయి.
ఆనంద్ భవన్ , స్వరాజ్ భవన్ అనేవి రెండు పక్కపక్కనే
ఉన్న రెండు భవనాలు . ఇందులో స్వరాజ్ భవన్ మోతిలాల్ నెహ్రూ గారు నివాస గృహం. ఆనంద భవనం
జవహర్ లాల్ నెహ్రూ గారి నివాస భవనం. ఆనంద భవనం నుంచి కొద్దీ దూరం లో రోడ్డుకు అవతలి
ప్రక్కన , భరద్వాజ ఆశ్రమం ఉంది . ఇది చాల చిన్న ఆలయం .
సీతా లక్ష్మణులతో, అరణ్య వాసం చెయ్యడానికి
అయోధ్య నుండి బయలు దేరిన శ్రీ రాముడు, గంగా నది దాటి, మొదట ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు.
అప్పుడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవి ఉండేది. ఈ అడవి మొదట్లో భరద్వాజ మహర్షి ఒక ఆశ్రమం
ఏర్పరచుకొని, నివాసం ఉండేవాడు. శ్రీ రాముడు వచ్చి ఆ మహర్షిని దర్శించాడు అని, ఆ మహర్షి
శ్రీ రామునికి ఆతిధ్యము ఇచ్చి తర్వాత ఇక్కడకు దగ్గరలోనే ఉన్న చిత్రకూటం అనే ప్రదేశంలో
ఆశ్రమం ఒకటి నిర్మించు కొని ఉండమని శ్రీ రామునికి భరద్వాజుడు చెప్పగా, శ్రీ రాముడు
అలాగే అని ఆశ్రమాన్ని నిర్మించుకున్నాడు. అలాహాబాదుకు నైఋతి దిశగా సుమారు 85 కిలోమీటర్ల
దూరంలో ఈ చిత్రకూటం అనే క్షేత్రం ఉంది.

0 Comments